పాకిస్తానీ అని ఎవరిని అయినా పిలిస్తే,అది మత విశ్వాసాలను కించపరిచినట్లు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొంది.మియాన్-తియాన్ లేదా పాకిస్తానీ అని పిలవడం హేళనకరమే అయినా,కానీ దీనితో మత విశ్వాసాలను దెబ్బతీసే ఉద్దేశం లేదన్నారు.జస్టిస్ బీవీ నాగరత్న,సతీశ్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న నిందితుడికి సమాచారం ఇచ్చేందుకు ఇంటికి వెళ్లిన సమయంలో…ప్రభుత్వ ఉద్యోగిపై ఆవేశానికి లోనయ్యాడు.ఆ ఉద్యోగి మతాన్ని దూషిస్తే కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
అయితే విధులను అడ్డుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.దీనితో ఆ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఐపీసీలోని 298,504,353 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.పాకిస్తానీ అని పిలవడం అమర్యాదకరంగా ఉన్నా,అది మత విశ్వాసాలను దెబ్బతీసినట్లు కాదు అని సుప్రీం బెంచ్ తెలిపింది.శాంతికి విఘాతం కలిగించే రీతిలో నిందితుడు ప్రవర్తించలేదని కోర్టు చెప్పింది.ఐపీసీలోని 353 సెక్షన్ కింద నిందితుడికి శిక్ష విధించే అవకాశం లేదని కోర్టు పేర్కొంది.