యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల మహాకుంభమేళా జరిగిన సంగతి తెలిసిందే.ఆ ఈవెంట్‌లో సుమారు 66 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు.త్రివేణి సంగమ తీరం సుమారు 45 రోజుల పాటు జనంతో కిక్కిరిసిపోయింది.అయితే అక్కడ బోట్లు నడుపుకునే ఓ కుటుంబం 30 కోట్లు ఆర్జించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.ప్రయాగ్‌రాజ్‌లోని నావికుల్ని ప్రభుత్వం దోచుకున్నట్లు చేసిన ఆరోపణలపై అసెంబ్లీ సీఎం యోగి బదులిస్తూ.. ఓ నావికుల కుటుంబం సక్సెస్ స్టోరీ చెప్పారు.
ఆ కుటుంబానికి 130 బోట్లు ఉన్నాయని,45 రోజల మహాకుంభ్ సమయంలో వాళ్లు 30 కోట్లు సంపాదించారని, అంటే ప్రతి బోటుపై 23 లక్షలు వచ్చాయని,అంటే ప్రతి రోజు వాళ్లు 52 వేల వరకు ఆర్జించారని సీఎం వెల్లడించారు.మహాకుంభ్‌ను ఎటువంటి లోటు లేకుండా నిర్వహించామని,శాంతి భద్రతలకు సమస్య రాలేదన్నారు.66 కోట్ల మంది భక్తులు, పర్యాటకులు ప్రయాగ్‌రాజ్‌లో అమృత స్నానాలు ఆచరించారని, ఒక్క నేర ఘటన కూడా చోటుచేసుకోలేదన్నారు.వేధింపులు,కిడ్నాప్‌లు,దొంగతనం,మర్డర్ లాంటి ఘటనలు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు.