వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సూపర్ – 6 హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హామీల అమలుకు ఈ ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం. కానీ ఈ ఏడాది బడ్జెట్ లో చంద్రబాబు కేటాయించింది రూ.17,179 కోట్లు మాత్రమేనని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్స్ లో ప్రజల్ని చంద్రబాబు మోసం చేసిన తీరు తేటతెల్లమైందని పరనింద.. ఆత్మస్తుతితో 9 నెలలుగా సరిపెడుతున్నారని ఆరోపించారు. సూపర్-6 హామీల అమలు సంగతేంటని ప్రశ్నిస్తే.. కూటమి నేతల నోటి నుంచి సమాధానం రావడం లేదని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ, యువతకు నిరుద్యోగ భృతి ఇలా ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్న చంద్రబాబు యువతను మోసం చేశారని ఆరోపించారు . సామాజిక ఆర్థిక సర్వేలో అయితే ఏకంగా రూ. 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకున్నారు. అది కూడా అబద్ధమేనని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ .. భవిష్యత్ గ్యారెంటీ అని ఊదరగొట్టి గెలిచాక జనాన్ని దర్జాగా వంచిస్తున్నారని ఆరోపించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు