ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబుని ఉండవల్లి నివాసంలో కలిశారు. తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎంకు, కూటమి పెద్దలకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులును సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, వారిని అన్ని వేళలా గౌరవిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్‌టీయు రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలజీ తదితరులు ఉన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు
By admin1 Min Read
Previous Articleస్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్..!
Next Article కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు..!