లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరియు కొన్ని ఇతర పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ వెట్రి కళగం (టీ.వీ.కే) అధినేత సినీ నటుడు విజయ్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో దక్షిణాది ప్రాభవాన్ని నియోజకవర్గ పునర్విభజన తగ్గిస్తుందని పేర్కొన్నారు.
నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఆయా రాష్ట్రాలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి. ఈ ప్రక్రియ ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా ఉంటే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. దీన్ని ఏమాత్రం అంగీకరించమని స్పష్టం చేశారు. గత 50 ఏళ్లుగా తమిళనాడు సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించాయి. ఈనేపథ్యంలో ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన సరికాదని పేర్కొన్నారు. ఒకరి గెలుపు కోసం ఇంకొకరిని శిక్షించడం అన్యాయం. దక్షిణాది రాష్ట్రాల్లోని నియోజకవర్గాల సంఖ్య తగ్గినా అదే సమయంలో యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఆ సంఖ్య పెరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. అన్ని పార్టీలతో కలిసి దీనిపై పోరాడతాం. ప్రజాప్రతినిధుల కొరత సాధారణ ప్రజలకు సమస్యే కాదని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నాణ్యమైన విద్య, వైద్యం, రోడ్లు వంటి అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముందు వాటిపై దృష్టి సారించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు