కెనడా ప్రధానిగా తన బాధ్యతల నుండి జస్టిన్ ట్రూడో మరో రెండు రోజుల్లో తప్పకోనున్నారు. కెనడా ప్రజల్లో ఆయన ప్రభుత్వానికి ఆదరణ లేకపోవడం వలన ట్రూడో వైదొలగనున్నారు. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి ఈ వారంలో రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానిగా చివరిసారి కెనడా ప్రజలనుద్దేశించి ట్రూడో మాట్లాడారు. కెనడా ప్రధానిగా ఎల్లప్పుడూ దేశ పౌరుల ప్రయోజనాల కోసమే పనిచేసినట్లు తెలిపారు. ప్రజలకు తలవంపులు తెచ్చేలా ఎప్పడూ వ్యవహరించలేదని పేర్కొన్నారు. కెనడా పౌరుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసినట్లు తెలిపారు. కెనడా ప్రయోజనాలే తొలి ప్రాధాన్యంగా పనిచేసినట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో ఇప్పటి వరకు మెరుగైన పాలన అందించినట్లు తెలిపారు. ఈ అవకాశం దక్కడం తన అదృష్టమని అన్నారు. ఇక ఆయన భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఏడాది బాధ్యతలు స్వీకరించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కెనడాపై టారిఫ్ లు విధించడం పై స్పందించారు. కెనడా, మెక్సికోలు సంపన్నంగా ఉంటేనే ‘అమెరికా ఫస్ట్’ సాధ్యమవుతుందని ఏ ఒక్కరు ఓడిపోయి, మిగతా వారు గెలిచినా ఉపయోగం ఉండదన్నారు. అందరమూ విజేతలుగా నిలిస్తేనే ఆనందమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కెనడా ప్రధానిగా త్వరలో వైదొలగనున్న ట్రూడో… మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగంతో కన్నీరు
By admin1 Min Read