ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో కీలక బిల్లులు, ప్రతిపాదనలపై చర్చించారు. డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతిపై అనుమానం:
మాజీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వాచ్ మన్ రంగన్న మృతి చెందడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తాజాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రంగన్న మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు.
నేడు ఏపీ కేబినెట్ భేటీ అనంతరం వాచ్ మన్ రంగన్న మృతిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో పరిటాల రవి హత్య కేసులోనూ సాక్షులు ఇదే విధంగా మరణిస్తూ వచ్చారని… ఇప్పుడు వివేకా హత్య కేసులో అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Previous Articleబీఈడీ పేపర్ లీక్… ప్రభుత్వం సీరియస్:పరీక్ష రద్దు చేస్తూ నిర్ణయం
Next Article భారత్ కు టాలెంటే అడ్వాంటేజ్: సీనియర్ ఆటగాడు పుజారా