ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అన్ని మ్యాచ్ లలో భారత్ దుబాయ్ వేదికగా ఆడుతోంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ భద్రతాపరమైన కారణాలతో హైబ్రిడ్ మోడల్ లో తటస్థ వేదీకలో మాత్రమే ఆడతామని తేల్చి చెప్పింది. ఇక ఇందుకు పాకిస్థాన్ కూడా అంగీకరించింది. అయితే భారత్ ఆడిన మ్యాచ్ లు అన్నింటిలో విజయం సాధించి ఫైనల్ చేరింది. ఇదే పలు దేశాలకు చెందిన కొందరు తాజా, మాజీ ఆటగాళ్లకు కడుపుమంటగా మారింది. నోటికొచ్చిన మాటలతో తమ అసూయను వెళ్లగక్కుతున్నారు. వారికి మన క్రికెటర్లు బాగానే కౌంటర్ ఇస్తున్నారు. కొందరి క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యలను భారత సీనియర్ ఆటగాడు ఛటేశ్వర్ పుజారా ఖండించాడు. భారత జట్టుకు తన మ్యాచ్ లు దుబాయ్ లో ఆడుతుండడం అడ్వాంటేజ్ అంటూ వస్తున్న వార్తలపై పుజారా స్పందిస్తూ మ్యాచ్ లన్నీ అక్కడ ఆడుతుండడం అడ్వాంటేజ్ కిందనుంచి టాలెంటే అడ్వాంటేజ్ అని అన్నాడు. ఆ వాదనలో పసలేదనీ ఒకవేళ అన్ని మ్యాచ్ లు ఓడిపోతే అక్కడ ఆడడం వలనే ఓడిపోయారని ఎవరూ అనరాని అన్నాడు. భారత్ నాణ్యమైన ఆల్ రౌండర్లు స్పిన్నర్లు ఉన్నారని చెప్పారు. మిగిలిన టీమ్ లతో పోలిస్తే భారత్ బలమైన జట్టని నిజానికి భారత్ కలిసి వస్తోంది టీమ్ బ్యాలెన్స్ అని పేర్కొన్నాడు.
Previous Articleసీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ
Next Article వాద్వానీ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం