మల్లేశం, 8 ఏఎమ్, మెట్రో వంటి చిత్రాలతో సినీ అభిమానులను ఆకట్టుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ.తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 23.ఇందులో తేజ, తన్మయ, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మిస్తుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈరోజు మహిళ దినోత్సవాన్ని సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
విడుదలైన ఈ టీజర్ చూస్తుంటే..దర్శకుడు రాజ్ రాచకొండ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో 1991లో జరిగిన చుండూరు మారణకాండ ఘటనతో పాటు, 1993లో జరిగిన చిలకలలూరిపేట బస్సు దహనం,1997లో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన కార్ బాంబు దాడి ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తుంది.ఈ ఘటనలో చనిపోయిన వారి కథ ఒక లాగే ముగియగా…ఈ ఘటనలకు పాల్పడిన హంతకుల కథ ఏం అయ్యింది అనే స్టోరీతో తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.

