మెడికల్, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ను తమిళంలో అందించాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. చెన్నై సమీపంలోని నగరికుప్పంలో జరిగిన సీఐఎస్ఎఫ్ 56వ ఆవిర్భావ వేడుకలలో అమిత్ షా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళ భాష మరియు సంస్కృతి దేశ వారసత్వానికి వెలకట్టలేని సంపద అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి భాషను దృష్టిలో ఉంచుకుని తగిన ప్రాధాన్యం ఇస్తుందని ఇంజనీరింగ్, మెడికల్ ఎడ్యుకేషన్ ను ప్రాంతీయ భాషల్లో చదివేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఈ కోర్సులు తమిళంలోనూ అందించడానికి సీఎం స్టాలిన్ ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు.త్రిభాషా విధానం విషయంలో ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రంలోని బీజేపీ మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. కాగా, ఈనేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మెడికల్, ఇంజనీరింగ్ తమిళంలో అందించండి… స్టాలిన్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి
By admin1 Min Read

