టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా అజేయంగా నిలిచి 12 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ విజేతగా భారత్ నిలిచింది. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో గెలిచి 3వ సారి ఈ ట్రోఫీని ముద్దాడింది. మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డేరీ మిచెల్ 63 (101; 3×4), మైఖేల్ బ్రేస్ వెల్ 53 నాటౌట్ (40; 3×4, 2×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. రచిన్ రవీంద్ర 37 (29; 4×4, 1×6), గ్లెన్ ఫిలిప్స్ 34 (52; 2×4, 1×6) పర్వాలేదనిపించారు. వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, కుల్ దీప్ యాదవ్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ ను ఘనంగా ఆరంభించింది. రోహిత్ శర్మ 76 (83; 7×4, 3×6) న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శుభ్ మాన్ గిల్ 31 (50; 1×6) పరుగులతో తొలి వికెట్ కు 105 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ (1) త్వరగానే పెవిలియన్ చేరాడు. శ్రేయాస్ అయ్యర్ 48 (62; 2×4, 2×6) కీలక ప్రదర్శన కనబరిచాడు. అక్షర్ పటేల్ 29 (40; 1×4, 1×6) తనదైన పాత్ర పోషించాడు. హార్థిక్ పాండ్య 18 (18; 1×4, 1×6) జట్టు పై కీలక సమయంలో ఒత్తిడి తగ్గించే షాట్లతో అలరించాడు. జడేజా 9 నాటౌట్ (6; 1×4) విన్నింగ్ షాట్ తో భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. కే.ఎల్.రాహుల్ 34 (33; 1×4, 1×6) మరో కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ 4 వికెట్ల తేడాతో విజేతగా అవతరించింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

