ఏపీ సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా విద్యార్థులు గళమెత్తారని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి ఈ సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారు. నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇదని పేర్కొన్నారు. పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవ్వరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. చంద్రబాబుగారూ… మీ గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ మీరు తీసుకు వచ్చారని దుయ్యబట్టారు.ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై, వారికోసం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ “యువత పోరు’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలందర్నీ అభినందిస్తున్నట్లు జగన్ ట్వీట్ చేశారు.
నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది: కూటమి సర్కార్ పై మాజీ సీఎం జగన్ ఫైర్
By admin1 Min Read