అక్రమంగా భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 2601 మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. 2024 జనవరి-2025 జనవరి మధ్య వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుండి భారత్ కు అక్రమ చొరబాట్లు అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు ఆయన రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారత్- బంగ్లా బోర్డర్ లో అధునాతన నిఘా టెక్నాలజీ సిస్టమ్ ను కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీ.ఐ.బి.ఎం.ఎస్)ను ఉపయోగిస్తున్నామని వీటితో పాటు తీసుకుంటున్న వివిధ చర్యలను వివరించారు.
బంగ్లా నుండి చొరబాట్లకు కట్టడి…2601 మంది బంగ్లాదేశీయులపై చర్యలు
By admin1 Min Read