అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించిన అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.కాగా ఆయన నిన్న పశ్చిమ రష్యాలోని కర్క్స్‌లో పర్యటించారు.అయితే ఈ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు కర్క్స్ లోని రష్యా దళాల కంట్రోల్ సెంటర్ కు అధ్యక్షుడు పుతిన్ వెళ్లారు.పుతిన్ మిలటరీ డ్రస్‌లో ఉన్న ఫొటోలను మీడియా ప్రసారం చేసింది.యుద్ధ భూమిలోని పరిస్థితులను అధ్యక్షుడు పుతిన్‌కు రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వలెరీ జెరసిమోవ్ వివరించారు.కొంత మంది ఉక్రెయిన్ సేనలు తమకు లొంగిపోయినట్లు చెప్పారు.త్వరగా ఈ ప్రాంతం నుండి కీవ్ దళాలను తరిమికొట్టాలని పుతిన్ ఆదేశించినట్లు సమాచారం.
తొలిసారిగా యుద్ధ భూమిలోకి అడుగు పెట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
By admin1 Min Read

