ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు లభించాయి. స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్స్ లో లక్ష్యసేన్ 21-13, 21-10తో డిఫెండింగ్ చాంపియన్ ఇండోనేషియా స్టార్ షట్లర్ జొనాథన్ క్రిస్టీ పై గెలిచి క్వార్టర్స్ లోకి దూసుకెళ్లాడు. మరోవైపు మహిళల సింగిల్స్ లో మాళవిక బాన్సోద్ 16-21, 13-21తో జపాన్ కు చెందిన అగ్రశ్రేణి షట్లర్ యమగూచి చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ పోరాటం కూడా ముగిసింది. చైనా ద్వయం జెంగ్-గ్జియ్ తో 16-21, 2-2తో ఉన్న సమయంలో చిరాగ్ కు వెన్ను గాయం వలన పోటీ నుండి తప్పుకుంది.
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో క్వార్టర్ ఫైనల్ చేరిన లక్ష్యసేన్
By admin1 Min Read