అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.తాజాగా, 41 దేశాల పౌరులపై అమెరికాలోకి ప్రవేశాన్ని నిరోధించే ప్రయాణ ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు.ఈ దేశాలను మూడు గ్రూపులుగా విభజించి,ఆయా దేశాలపై వివిధ స్థాయిలో ఆంక్షలు విధించనున్నారు.మొదటి గ్రూప్లో అఫ్గానిస్థాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తరకొరియా వంటి పది దేశాలు ఉండగా, ఈ దేశాల పౌరులకు వీసాల జారీ పూర్తిగా నిలిపివేయనున్నారు.రెండో గ్రూప్లో ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాలు ఉన్నాయి, వీరికి పాక్షిక ఆంక్షలు అమలు చేయనున్నారు.మూడో గ్రూప్లో పాకిస్థాన్, భూటాన్ సహా 26 దేశాలు ఉండగా, ఈ దేశాలకు 60 రోజుల గడువు ఇచ్చి, భద్రతా తనిఖీలను మెరుగుపరచుకోవాలని సూచించారు.ఈ నిర్ణయాలు అధికారికంగా ప్రకటించబడాల్సి ఉంది.
ట్రంప్ సంచలన నిర్ణయం…పాక్ తో సహా 41 దేశాలపై ప్రయాణ ఆంక్షలు…!
By admin1 Min Read

