ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలు ఏమి చెప్పినా వినే ప్రభుత్వమని గత ప్రభుత్వంలో మాదిరి, ప్రజలకు తనకు మధ్య పరదాలు లేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టాం. రాష్ట్రంలో అందరూ నెలకు ఒక రోజు స్వచ్ఛాంధ్ర కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, మన ఆరోగ్యం కాపాడుతూ, మన కోసం ఎవరూ చేయని పని పారిశుధ్య కార్మికులు చేస్తున్నారు. వారిని మనం సమాజంలో గౌరవించాలని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ళ క్రితం ఇదే రోజు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను. 41 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను. 9 ఏళ్ళు సమైక్యాంధ్ర సీయంగా, మొత్తంగా 14 ఏళ్ళకు పైగా సీయంగా ఉన్నా. పదేళ్ళు ప్రతిపక్ష నేతగా చేశాను. ప్రజలు నాకు ఇచ్చిన గౌరవం ఇది. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు, తెలుగువారికి న్యాయం చేయాలనేదే ఏకైక సంకల్పమని తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు పేర్కొన్నారు.వేస్ట్ టు ఎనర్జీ కింద, కుళ్లిపోయిన కూరగాయల నుంచి సంపదను సృష్టించే ప్రయోగాత్మక ప్రయత్నం తణుకులో చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే, రాష్ట్రమంతటా అమలు చేస్తామని వివరించారు.
రాష్ట్రంలో అందరూ నెలకు ఒక రోజు స్వచ్ఛాంధ్ర కోసం పని చేయాలి: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read

