విద్యారంగంపై శాసనమండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారు? అని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ ఆ రోజు చెప్పామని మీరెందుకు బాయ్ కాట్ చేశారని మండలిలో ప్రతిపక్ష వైసీపీపై మండిపడ్డారు. ఆ రోజు జరిగిన చర్చలో ఫీజు రీయింబర్స్ మెంట్ పై చాలా స్పష్టంగా వివరించినట్లు తెలిపారు. వినకుండా, చదవకుండా మళ్లీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో రూ.4,200 కోట్లు బకాయిలు పెట్టారు. అవునో, కాదో చెప్పాలని వివరాలు పంపిస్తామని లోకేష్ అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కచ్చితంగా చెల్లిస్తామని హౌస్ సాక్షిగా హామీ ఇచ్చానన్నారు. చర్చలో వైసీపీ సభ్యులు లేకపోతే తానేం చేయగలనని బీఏసీలో విద్యారంగంపై చర్చ కావాలని అడిగితే ఒప్పుకున్నామని కానీ ఆ చర్చకు వైసీపీనే లేదని పేర్కొన్నారు . వాస్తవాలు వినడానికి వైసీపీ సభ్యులు సిద్ధంగా లేరని విమర్శించారు.
విద్యారంగంపై చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారు?: మంత్రి లోకేష్
By admin1 Min Read
Previous Articleఈసారి సంక్రాంతికి మెగాస్టార్ తో రానున్న అనిల్ రావిపూడి
Next Article ఐపీఎల్ అభిమానులకు జియో ఆఫర్..!