టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ మేరకు ఆసుపత్రి బెడ్‌పై పడుకుని ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆమె, సెలైన్ ఎక్కించుకుంటున్నట్లు కనిపించింది.ఈ ఫొటో చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సమంత మళ్లీ అనారోగ్యానికి గురయ్యిందా? ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? అనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సమంత, కోలుకున్న తర్వాత ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌తో నటన కొనసాగించింది.ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ’ చిత్రంలో నటిస్తున్న సమంత,‘మా ఇంటి బంగారం’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది.అలాగే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో తన తొలి నిర్మాణ ప్రాజెక్ట్ ‘శుభం’ షూటింగ్‌ను ప్రారంభించింది.అయితే ఆసుపత్రి ఫొటోలు షేర్ చేయడంతో ఆమె ఆరోగ్యంపై కొత్తగా చర్చ మొదలైంది.

