మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో వస్తున్న భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’.కాగా ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహ్స్తున్నాడు.ఈ సినిమా 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ కు సీక్వెల్‌గా రూపొందింది.తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను వెల్లడించారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై నిర్మించారు.మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్, టొవినో థామస్,మంజు వారియర్, ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటుడు జెరోమ్ ఫ్లైన్ ఈ సినిమాతో భారతీయ తెరకు పరిచయం కానున్నారు.ఈ చిత్రాన్ని యుకె, యుఎస్, యుఏఇ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు.ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Previous Articleభారత్ పై బిల్ గేట్స్ ప్రశంసలు… త్వరలోనే భారత పర్యటన
Next Article ఆసుపత్రిలో నటి సమంత…!

