అమృత్‌సర్‌లోని ఓ గుడిపై గత శుక్రవారం రాత్రి గ్రెనేడ్ దాడి జరిగింది.కాగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు హ్యాండ్ గ్రెనేడ్ విసిరి అక్కడి నుండి పరారయ్యారు.పేలుడుతో ఆలయ గోడ స్వల్పంగా ధ్వంసమైంది.దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.సోమవారం తెల్లవారుజామున రాజసాన్సీ ప్రాంతంలో గుర్సిదక్ సింగ్, విశాల్ అనే నిందితులు పోలీసులకు ఎదురుపడ్డారు.వారిని పట్టుకునే క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపారు.ఈ మేరకు పోలీసులు ఎదురు కాల్పులు చేయగా గుర్సిదక్ గాయపడి ఆసుపత్రిలో మరణించాడు. అతని సహచరుడు విశాల్ పరారవగా, అతడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
అమృత్‌సర్‌లో గుడిపై గ్రెనేడ్ దాడి – ఎదురు కాల్పుల్లో నిందితుడు మృతి
By admin1 Min Read