భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (ఖాకీ 2)లో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారని కొద్ది రోజుల క్రితం కొన్ని ఫొటోలు షేర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై స్పష్టత వచ్చింది.
మార్చి 20 నుండి ఈ సిరీస్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుపుతూ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లక్స్ ఒక వీడియో పంచుకుంది. ‘ది బెంగాల్ టైగర్ మీట్స్ బెంగాల్ ఛాప్టర్’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో గంగూలీ ఖాకీ దుస్తుల్లో కనిపించారు. హీరో చేయాల్సిన పనులన్నీ దర్శకుడు చెప్పగా.. ఇవన్నీ చేయడం తనవల్ల కాదని గంగూలీ అంటాడు. అయితే మీరు మార్కెటింగ్ చేయండని దర్శకుడు అనడంతో మన దాదా దానికి సరే అంటాడు. దీంతో ఈ సిరీస్ ప్రచారంలో గంగూలీ భాగమయ్యారని తెలుస్తోంది.
నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘ఖాకీ ది బిహార్ చాప్టర్’కు కొనసాగింపుగా ఇది రానుంది. 2022లో ఇది నెట్ ఫిక్స్ వేదికగా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. దీంతో దీనికి సీజన్ 2ను రూపొందించారు. బెంగాల్ నేపథ్యంలో సాగే కథతో రూపొందింది.
The Bengal Tiger meets the Bengal Chapter 👀🐯
Watch Khakee: The Bengal Chapter out 20 March, only on Netflix.#KhakeeTheBengalChapterOnNetflix pic.twitter.com/wawwa5oq58— Netflix India (@NetflixIndia) March 17, 2025