ఏపీ అసెంబ్లీలో స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ పై చర్చ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై మాట్లాడారు. వికసిత్ భారత్ 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరాలని అన్నారు. వికసిత్ భారత్ ను ప్రధాని మోడీ అవలంభిస్తున్నారు. పేదరిక నిర్మూలన వంటి పది సూత్రాలను లక్ష్యంగా పెట్టుకున్నాం. రంగాల వారీగా ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జిల్లాల వారీగా ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తాం. మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేస్తామని వివరించారు. చేపలు ఇవ్వడం కాదు.. చేపలు పట్టేలా ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 2029 లోపు మనం ఏమి సాధించాలి అనేది స్పష్టంగా ఒక విజన్ పెట్టుకున్నాం. ప్రతీ కుటుంబానికి సామాజిక భద్రత కల్పించాల్సి ఉంది. ప్రతీ కుటుంబానికి నివాసస్థలం, ఇల్లు, సురక్షిత నీరు, గ్యాస్ కనెక్షన్, సోలార్ కరెంట్, ఇంటర్నెట్, ఇలా అన్ని సౌకర్యాలు అందించడమే మా ప్రభుత్వం లక్ష్యం. ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత ఎమ్మెల్యేలదే. దాని అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
స్వర్ణాంధ్ర విజన్ -2047 డాక్యుమెంట్ పై చర్చ: ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
By admin1 Min Read