మూడు దశాబ్దాలకు పైగా తన సంగీత ప్రస్థానంలో ఎన్నో డిఫరెంట్ ఎమోషన్స్ కు సంగీత రూపాన్ని ఇచ్చి మన రోజువారీ జీవితంలో భాగమైన పాటలతో మైమరిపించి తెలుగు చిత్రసీమను,సినీ అభిమానులను అలరించిన లెజెండరీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో మొట్టమొదటిసారిగా లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించనున్నారు.”నా టూర్” పేరుతో ఈ గ్రాండ్ ఈవెంట్ మార్చి 22న హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరగనుంది.హైదరాబాద్ టాకీస్ సంస్థ ఈ ప్రత్యేకమైన సంగీత సంబరాన్ని నిర్వహిస్తోంది.కీరవాణి తన కెరీర్‌లో అద్భుతమైన హిట్ పాటలను ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా ఆలపించనుండటంతో కీరవాణి సంగీతపు జల్లుల్లో తడిసి పసైందైన పాటలు విందుతో ఆహ్లాదం పొందాలని సంగీతాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఆస్కార్ గెలుచుకున్న తర్వాత మెగా ఈవెంట్
“నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న కీరవాణి, అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.తన సంగీత ప్రయాణంలో కొత్త అధ్యాయంగా, భారీ స్థాయిలో ఈ మ్యూజికల్ టూర్‌ను నిర్వహించనున్నారు.కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా,ఈ టూర్ అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ కొనసాగనుందని సమాచారం.ఇది కీరవాణి కెరీర్‌లోనే మొదటిసారి , అయితే ఈ ప్రయాణం సంగీత ప్రపంచంలోనూ ఓ ప్రత్యేకమైన ఘట్టంగా నిలవనుంది.
సినీ ప్రముఖుల నుంచి ప్రత్యేక మద్దతు
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సినీ ఇండస్ట్రీ నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది.దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి ఈ కన్సర్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కీరవాణి సంగీత ప్రస్థానం గురించి ఆసక్తికరంగా వివరించిన వీరు,ఈ కన్సర్ట్‌ను మిస్ కాకుండా సంగీత ప్రియులు తప్పక చూడాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో
ఈ మ్యూజికల్ టూర్ టికెట్లు ఇప్పటికే డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. కీరవాణి సంగీత మాయలో తేలియాడేందుకు అందరికీ ఇదొక అరుదైన అవకాశం. సుదీర్ఘ కాలం పాటు సంగీత ప్రియులను అలరించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు ప్రత్యక్షంగా తన సంగీతాన్ని అందించబోతుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.”నా టూర్” కన్సర్ట్,సంగీత ప్రపంచంలో ఓ మైలురాయిగా నిలిచి సందడి చేయబోతోంది.సంగీత ప్రియులు ఈ అపూర్వమైన మ్యూజికల్ ఫెస్టివల్‌ను మిస్ కాకుండా ఎంజాయ్ చేయండి..!