వైసీపీ సభ్యులు కొంత మంది దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చురకలంటించారు. ప్రజాస్వామ్యంలో అది సమంజసం కాదని దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరమేంటి? మీరు ఎమ్మెల్యేలు, దర్జాగా రండని వారికి హితం పలికారు. రిజిస్టర్ లో సంతకాలు పెట్టి సభలో కనిపించడంలేదు. వైసీపీ సభ్యుల తీరు దురదృష్టకరమని అన్నారు. రిజిస్టర్ లో సంతకాలు చేసి సభలో కనిపించని ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధరెడ్డి, విశ్వేశ్వరరాజులు. ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని స్పీకర్ కోరారు.
దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరమేంటి?: వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అసంతృప్తి
By admin1 Min Read

