అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి సినీరంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు.‘బ్రిడ్జ్ ఇండియా’ సంస్థ ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంతో పాటు సామాజిక సేవలోనూ కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో స్పందించిన చిరంజీవి, ఈ గౌరవాన్ని మాటల్లో వివరించలేనని, తన హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందని చెప్పారు. బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో ఈ అవార్డు పొందడం గర్వకారణంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తన సినిమా, సామాజిక సేవా ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇది మరింత ప్రేరణనిస్తుందని తెలిపారు.
Heart filled with gratitude for the honour at the House of Commons – UK Parliament by so many Esteemed Members of Parliament , Ministers & Under Secretaries, Diplomats. Humbled by their kind words. Heartened by the Life Time Achievement Award by Team Bridge India.
Words are not… pic.twitter.com/XxHDjuFIgM
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2025