ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై బెట్టింగ్ యాప్ ప్రకటనలతో సంబంధం ఉందని వార్తలు రావడం కలకలం రేపింది.దీనిపై ఆయన స్వయంగా స్పందిస్తూ, ప్రస్తుతం తాను సినిమా షూటింగ్‌లో ఉన్నానని తెలిపారు.2016లో ఓ గేమింగ్ యాప్‌కు ప్రచారం చేసినప్పటికీ,అది ఇల్లీగల్‌గా మారిందని తెలిసిన వెంటనే కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నానని వివరణ ఇచ్చారు.2021లో ఆ యాప్‌ను వేరొకరు కొనుగోలు చేసి తన పాత ప్రకటనలను ఉపయోగించారని, దీనిపై లీగల్ నోటీసులు పంపించానని చెప్పారు.తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ, పోలీసులు తనను ఎలాంటి విచారణకు పిలవలేదని తెలిపారు.యువత బెట్టింగ్ యాప్‌ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Previous Articleతెలుగు గడ్డపై పుట్టి విజయవంతంగా పాతికేళ్లకు పైగా ఉన్న పార్టీలు రెండే …ఒకటి టీడిపి అయితే…రెండోది బీఆర్ఎస్ :- కేటీఆర్
Next Article మేలో తెలంగాణలో ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలు..!

