బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల ఏర్పాట్లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ రోజు సన్నాహక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ మేరకు ఆయన.మాట్లాడుతూ…తెలుగు గడ్డపై పుట్టి విజయవంతంగా పాతికేళ్లకు పైగా ఉన్న పార్టీలు రెండేనని అన్నారు.అందులో ఒకటి టీడీపీ అయితే, రెండోది బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.గతంలో తెలుగువారిని మద్రాసీలుగా పిలిచేవారని, ఎన్.టి.ఆర్. టీడీపీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని గుర్తు చేశారు.అదే విధంగా, తెలంగాణ ప్రత్యేక గుర్తింపును ప్రపంచానికి తెలియజెప్పిన నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, అది ప్రజల్లో బలమైన మద్దతు సంపాదించిందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి సాధించిందని, ఈ విజయాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ మరింత బలంగా ఎదగాలని ఆకాంక్షించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఇందులో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జూబ్లీ ఉత్సవాలు పార్టీ చరిత్రను ప్రతిబింబించేలా ఉంటాయని చెప్పారు. ఈ వేడుకలు బీఆర్ఎస్ బలాన్ని, తెలంగాణ సమర్థతను ప్రపంచానికి తెలియజేస్తాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలుగు గడ్డపై పుట్టి విజయవంతంగా పాతికేళ్లకు పైగా ఉన్న పార్టీలు రెండే …ఒకటి టీడిపి అయితే…రెండోది బీఆర్ఎస్ :- కేటీఆర్
By admin1 Min Read
Previous Articleభారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు…76 వేల దాటిన సెన్సెక్స్
Next Article బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాశ్ రాజ్ స్పందన..!

