ఈరోజు సాయంత్రం మంగళగిరి లోని క్యాంప్ కార్యాలయంలో అమరావతి చిత్రకళ వీధి పోస్టర్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ క్రియేటివిటీ మరియు కల్చరల్ కమీషన్ చైర్మన్ శ్రీమతి తేజస్వి పొడపాటి, AP కల్చరల్ కమీషన్ సీఈఓ మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. అమరావతి చిత్రకళ వీధి అనేది కళా ప్రదర్శన మాత్రమే కాదని రాష్ట్రంలోని అలాగే దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల యొక్క ప్రతిభ, తమ కళలను ప్రదర్శించే అవకాశం అని స్పష్టం చేశారు. ఎందరో ప్రతిభ ఉన్న కళాకారులు గుర్తింపు పొందలేకపోయారని అలాంటి వారందరికీ ఇది ఒక మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు.
అమరావతి చిత్రకళా వీధి అనేది ఆంధ్రప్రదేశ్లోని కళాకారులకు ఒక మంచి వేదిక! అని తేజస్వీ పొడపాటి అన్నారు. పోస్టర్ను ఆవిష్కరించినందుకు డిప్యూటీ సీఎం పవన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలని ఈ అద్భుతమైన కళా ఉత్సవంలో భాగం అవ్వండని ఆమె ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

