మూడు దశాబ్దాలుగా తాను ఇచ్చిన ఒకే మాట మీద చంద్రబాబు ఉన్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు, ఒత్తిడులు వచ్చినా, న్యాయం కోసం నిలబడిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.ఎస్సీ వర్గీకరణపై ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయమని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబుదే కీలకపాత్ర. 1997-98లో తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు.
1997లో తాను చంద్రబాబు తల్లి ఆశీస్సులు తీసుకుని పాదయాత్ర ప్రారంభించానని గుర్తుచేసుకున్నారు. 30 ఏళ్ల పోరాటంలో అమరులైన వారికి ఈ విజయం అంకితం ఇస్తున్నామని అన్నారు. తమ ఉద్యమంలో న్యాయం ఉందనే దానికి ఈ ఏకగ్రీవ తీర్మానాలే నిదర్శనం అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తమకు అండగా నిలిచారని మంద కృష్ణ మాదిగ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తుచేస్తూ పవన్ కల్యాణ్ కూడా మద్దతు ఇచ్చారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై వైసీపీ ఇప్పటికీ తమ అభిప్రాయాన్ని చెప్పలేదని గతంలో కనీసం వినతిపత్రం ఇచ్చేందుకు కూడా జగన్ తమకు అనుమతి ఇవ్వలేదని అన్నారు. జగన్ ఉండి ఉంటే ఎస్సీ వర్గీకరణను ఇక చూసేవాళ్లమే కాదని మంద కృష్ణ పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు