ఐపీఎల్ సీజన్ 18 అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలిచి సీజన్ ను బెంగళూరు ఘనంగా ఆరంభించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించినప్పటికీ క్రమంగా వికెట్లు కోల్పోతూ ఆ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ అజింక్య రహానే 56 (31; 6×4), సునీల్ నరైన్ 44 (26; 5×4, 3×6), రఘవంశీ 30 (22; 2×4, 1×6) పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య 3 వికెట్లు, హేజల్ వుడ్ 2 వికెట్లు, యశ్ దయాళ్, రసిక్ సలామ్, సుయాష్ శర్మ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో బెంగళూరు అదరగొట్టింది. ఫిలిప్ సాల్ట్ 56 (31; 9×4, 2×6), రజత్ పటేదార్ 34 (16; 5×4, 1×6), విరాట్ కోహ్లీ 59 నాటౌట్ (36; 4×4, 3×6), లివింగ్ స్టోన్ 15 (5; 2×4, 1×6) చెలరేగి ఉండడంతో మరో 3.4 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ చేధించింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

