కెనడాలో మధ్యంతర ఎన్నికలు వచ్చే నెల 28న జరగనున్నట్లు ప్రధాని మార్క్ కార్నీ అధికారికంగా ప్రకటించారు.మొత్తం 343 పార్లమెంటు స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై విధిస్తున్న సుంకాలు ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారాయి.ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ప్రధాని కార్నీ, ప్రతిపక్ష కన్జర్వేటివ్ నేత పియరీ పోలీవర్ ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ ఎన్నికల ప్రచారం 37 రోజుల పాటు కొనసాగనుంది.జస్టిన్ ట్రుడో తొమ్మిదేళ్లపాటు కెనడా ప్రధానిగా వ్యవహరించిన తర్వాత ఈ నెల 14న కార్నీ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.తన మొదటి ప్రచార సమావేశంలో కార్నీ, ట్రంప్ విధిస్తున్న ఆర్థిక పరిమితులను తీవ్రంగా విమర్శించారు.కెనడా ఆర్థిక వ్యవస్థను పటిష్ఠంగా మార్చడం తన ప్రాధాన్య లక్ష్యమని ఆయన ప్రకటించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

