పార్లమెంటులో ఏపీకి చెందిన అరకులో గిరిజనులు పండించే అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించిన సంగతి తెలిసిందే.పార్లమెంట్లో నేడు అరకు కాఫీని ప్రారంభించిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జువాల్ ఓరాం, కిరణ్ రిజిజు లు ప్రారంభించారు. కాగా, పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం కావడం గర్వకారణమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ నుంచి GI ట్యాగ్ పొందిన ఈ ఆర్గానిక్ కాఫీ కేవలం ఒక పానీయమే మాత్రమే కాదు. ఇది 1.5 లక్షల గిరిజన రైతుల శ్రమకు దక్కిన ఫలితం, ఎన్నో ఏళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న గిరిజన రైతుల కృషి నేడు అరకు కాఫీని జాతీయ వేదికపై నిలిపిందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సహకారంతో, అరకు కాఫీ లాంటి GI ఉత్పత్తులు గుర్తింపు పొందుతున్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాల సాధికారతకు తోడ్పాటును అందించడమే గాక భారతదేశ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తోందని తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు మద్దతుగా నిలిచిన కేంద్ర మంత్రులలకు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజన రైతుల కృషి నేడు అరకు కాఫీని జాతీయ వేదికపై నిలిపింది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
By admin1 Min Read
Previous Articleకడపలో వైసీపీ అధినేత జగన్ పర్యటన..!
Next Article కెనడాలో మధ్యంతర ఎన్నికలు

