కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పౌరసత్వం వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. విచారణకు ఎనిమిది వారాల గడువు కోరినప్పటికీ, న్యాయస్థానం కేవలం నాలుగు వారాల సమయాన్నే మంజూరు చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 21వ తేదీకి వాయిదా వేసింది.రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, కర్ణాటక బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్ పిటిషన్లు దాఖలు చేశారు. రాహుల్ గాంధీ బ్రిటన్‌లోని ఓ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారని, ఆ కంపెనీ నివేదికలో ఆయన బ్రిటన్ పౌరుడిగా పేర్కొన్నారని ఆరోపణలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారత పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం ఇది ఉల్లంఘనగా పరిగణించవచ్చని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీ పౌరసత్వ వివాదంపై అలహాబాద్ హైకోర్టు కేంద్రానికి గడువు
By admin1 Min Read
Previous Articleజ్యోతిరావు ఫూలే బయోపిక్ ట్రైలర్ విడుదల…!
Next Article పార్లమెంట్‌లో ‘ఛావా’ ప్రత్యేక ప్రదర్శన…?