ఎన్నో అద్భుతమైన క్రికెట్ మ్యాచ్ లకు వేదికగా నిలిచిన ప్రతిష్టాత్మక ‘గబ్బా’ స్టేడియం ఇక గతంగా మారిపోనుంది. 2032 ఒలింపిక్స్ తర్వాత ఈ స్టేడియంను కూల్చేయాలని క్వీన్స్ ల్యాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిస్బేన్ లోని విక్టోరియా పార్క్ ప్రాంతంలో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు నిర్మిస్తున్న స్టేడియంకు ఇక క్రికెట్ తరలిపోనుంది. క్వీన్స్ ల్యాండ్ ప్రీమియర్ డేవిడ్ క్రిసాపుల్లి ఒలింపిక్స్ తాజా ప్లాన్స్ ను వివరించాడు. ఒలింపిక్స్ కోసం గబ్బా స్టేడియాన్ని కూల్చి తిరిగి నిర్మించాలని మొదట భావించినా ఖర్చు పెరుగుతుండటంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా ప్రముఖ స్టేడియాన్ని ఆవిష్కరించడానికి క్వీన్స్ల్యాండ్ సిద్ధమవుతోందని ఆయన అన్నారు. మెగా ఈవెంట్ నిర్వహణకు మంచి స్టేడియం కావాలని వారసత్వాన్ని అందించలేని తాత్కాలిక సౌకర్యాలు, తాత్కాలిక స్టాండ్ల కోసం బిలియన్లకొద్దీ డాలర్లు ఖర్చు చేయడమా లేదా కొత్త వేదికలో క్రికెట్ భవిష్యత్తును భద్రపరచడమా అనే అంశాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందని క్రిసాపుల్లి తెలిపాడు. 1990లో ఒకే ఒక్క సారి ప్రపంచ క్రీడల్లో క్రికెట్ ఆడించగా.. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్లోలో మళ్లీ పునరాగమనం చేయనుంది.
2032 ఒలింపిక్స్ తరువాత చరిత్రగా మిగిలిపోనున్న ప్రతిష్టాత్మక ‘గబ్బా’ స్టేడియం
By admin1 Min Read