అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 11 పరుగులతో గెలుపొందింది.టాస్ గెలిచిన గుజరాత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 97నాటౌట్ (42; 5×4, 9×6) అజేయంగా సెంచరీకి చేరువలో నిలిచాడు. ప్రియాన్ష్ ఆర్య 47 (23; 7×4, 2×6), శశాంక్ సింగ్ 44 నాటౌట్ (16; 6×4, 2×6), స్టోయినీస్ 20 (15; 1×4, 2×6) పరుగులతో గుజరాత్ భారీ స్కోరు సాధించడంలో తమ వంతు పాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 3 వికెట్లు, రబడా, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ ఇన్నింగ్స్ మెల్లగా ఆరంభించిన తరువాత దూకుడు పెంచింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ 74 (41; 5×4, 6×6) హాఫ్ సెంచరీతో మంచి ప్రదర్శన కనబరిచాడు. జాస్ బట్లర్ 54 (33; 4×4, 2×6) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్ మాన్ గిల్ 33 (14; 2×4, 3×6), రూధర్ ఫోర్డ్ 46 (28; 4×4, 3×6) పోరాడాడు. పంజాబ్ బౌలర్లు కీలక సమయాల్లో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో విజయానికి 11 పరుగుల దూరంలో గుజరాత్ ఆగిపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు