సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ తన టూరిజం అభివృద్ధిపై దృష్టిని మరోసారి స్పష్టంగా తెలియజేశారు.తెలంగాణ అసెంబ్లీలో కూనంనేని వ్యాఖ్యలు చేస్తూ, చంద్రబాబు గతంలో “ఏ ఇజం లేదు, టూరిజమే ప్రధానం” అన్న మాటలు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు టూరిజమే నిజంగా ఖర్చు లేని ఇజమని వ్యాఖ్యానించారు. దీనిపై చంద్రబాబు నవ్వుతూ స్పందిస్తూ, “కమ్యూనిస్టులు నా మాటలను అర్థం చేసుకోవడానికి 30 ఏళ్లు పట్టింది” అన్నారు.రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్ధి కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయని, జిల్లా కలెక్టర్లు టూరిజం ప్రాజెక్టులపై దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు. టూరిజం ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు పెరగడం, ప్రభుత్వానికి ఆదాయం సమకూరడం వంటి ప్రయోజనాలను ఆయన వివరించారు.ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధిని సృష్టించగలిగే రంగం టూరిజమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
Previous Article‘ది ప్యారడైజ్’ కౌంట్‌డౌన్ పోస్టర్… వైవిధ్యంగా నాని లుక్స్
Next Article వరుస లాభాలకు బ్రేక్…తగ్గిన సూచీల జోరు..!