‘దసరా’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. 2026 మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేటికి సినిమా విడుదలకు సరిగ్గా ఏడాది సమయం ఉన్నందున ‘365 రోజులు’ అంటూ ఓ కొత్త పోస్టర్ ను హీరో నాని తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లో నాని ఒంటిపై చొక్కలేకుండా గన్ పట్టుకుని రగడ్ లుక్‌లో సరికొత్తగా కనిపించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లోనూ ఒకేసారి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల ఈ చిత్రం నుంచి ‘రా స్టేట్‌మెంట్’ పేరుతో ఓ వీడియోను విడుదల చేయగా అందులో డైలాగ్స్, నాని లుక్, గెటప్ అన్నీ విభిన్నంగా ఉన్నాయి. రా అండ్ రస్టిక్ లుక్ లో నాని కనిపించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
365 Days/రోజులు.#TheParadise pic.twitter.com/jITmj1Cq9e
— Nani (@NameisNani) March 26, 2025