ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈసందర్భంగా ప్రాజెక్టు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా సందర్శించారు. అనంతరం నిర్వసితులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములు ఇచ్చారన్నారు. వారిలో కొందరికి మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారని నిన్నమొన్నటి దాకా నిర్వాసితులను పట్టించుకున్న నాథుడు లేడని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇచ్చామని వివరించారు . తాజాగా రూ. 800 కోట్లకు పైగా పరిహారం ఖాతాల్లో జమ చేసాం. సీఎంగా ఉన్నప్పుడు వరదలు వస్తే ప్రజలను నీరుకు జగన్ వదిలేసాడని ఆక్షేపించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. విపత్తుల సమయంలో నిర్వాసితులను ఆదుకున్నామని పేర్కొన్నారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందే 2027 నవంబర్ నాటికి పునరావాసం పూర్తిచేస్తాం. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామని పునరుద్ఘాటించారు. మన ఎన్డీయే ప్రభుత్వంలో సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేసుకుందామని భరోసానిచ్చారు.

Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

