ప్రస్తుతం రాజకీయ అనిశ్ఛితితో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్ నిన్న 53వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం సందర్భంగా బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు లేఖలో పేర్కొన్నారు. ఈరోజు మన రెండు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజు. మన త్యాగాలు, ఉమ్మడి చరిత్రకు ఈరోజు నిదర్శనం. బంగ్లా విముక్తి పోరాటం రెండు దేశాల సంబంధాలకు మార్గదర్శకంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. రెండు దేశాల ప్రయోజనాలు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని ఇరు దేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని మోడీ స్పష్టం చేశారు.
ఇక గతేడాది బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం ఆ దేశంలో హిందువులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి.
యూనిస్ కు బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోడీ లేఖ
By admin1 Min Read

