బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుసగా హత్య బెదిరింపులు వస్తున్నాయి.ఈ బెదిరింపులపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందిస్తూ,తాను దేవుడిని నమ్ముతానని,ఆయనే అన్నీ చూసుకుంటాడని తెలిపారు.భద్రత కారణంగా ఇంటి వద్ద మరియు షూటింగ్ లొకేషన్లలో తన చుట్టూ మరింత కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.1998 కృష్ణ జింక కేసు విషయంలో సల్మాన్ ఖాన్ ఈ గ్యాంగ్ టార్గెట్‌గా మారాడు.గతేడాది ముంబయి గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది.సల్మాన్‌పై మరోసారి దాడి చేసేందుకు కుట్రపన్నినట్లు పోలీసులు గుర్తించారు.ప్రాణహాని ఉందన్న కారణంగా ముంబయి పోలీసులు ఆయనకు వైప్లస్ భద్రతను కల్పించారు.తాజాగా గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో బుల్లెట్‌ఫ్రూఫ్ గ్లాస్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.మరోవైపు,సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ చిత్రంలో నటిస్తున్నారు.ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు