గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థులకు NEET, CUET వంటి పోటీ పరీక్షల కోసం సిద్దం చేసే విధంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యార్థులు మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఈ కీలక పరీక్షల్లో రాణించేందుకు అవసరమైన గైడెన్స్ అందుతుందని, అగ్రశ్రేణి మెడికల్ కాలేజీలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆశీష్ సూద్ అన్నారు. మరోవైపు, ఈ కార్యక్రమంలో భాగంగా పీడీఎఫ్ నోట్సు, విద్యార్థుల పురోగతిని మానిటర్ చేసేలా పరీక్షలు, నిరంతరం డౌట్స్ తీర్చడం ఉంటుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దీనికోసం విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణ ఇచ్చేలా బిగ్ ఇన్స్టిట్యూట్, ఫిజిక్స్ వాలా లిమిటెడ్ సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో 12వ తరగతి చదువుతూ సీయూఈటీ, నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యే దాదాపు 1.63లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది.
ప్రభుత్వ విద్యార్థు కోసం ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం…1.63 లక్షల మందికి లబ్ధి
By admin1 Min Read