ఐఐటీ మద్రాస్ లో “ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025” లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదేనని పేర్కొన్నారు. మద్రాస్ ఐఐటీలో దాదాపు 25-30 శాతం తెలుగు విద్యార్థులే ఉన్నారు. ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయని తెలిపారు.ఎక్కడికెళ్ళినా మన తెలుగు వారే ఉన్నారు. ఏ దేశం వెళ్ళినా మన వాళ్ళే ఉన్నారు. ఐ యాం ప్రౌడ్ టు బి యాన్ ఇండియన్.. అలాగే తెలుగు వాడిగా గర్వపడుతున్నా. 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడా.. 2025లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాని అన్నారు.ఆ రోజు హైటెక్ సిటీ కట్టా. ఇప్పుడు క్వాంటం వ్యాలీ డెవలప్ చేస్తున్నామని తెలిపారు. 1999లో పవర్ సెక్టార్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. గ్రీన్ హైడ్రోజెన్ రంగంలో ఇప్పటికే అనేక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
ఐఐటీ మద్రాస్ లో “ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025” లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read