ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ చివరి రోజైన నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. మొత్తంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా 5% లాభాలను ఇచ్చాయి. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న సుంకాలకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 191 పాయింట్ల నష్టంతో 77,414 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 23,519 వద్ద ట్రేడింగ్ ముగించింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.85.48గా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో టాటా మోటార్స్, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి.
నేటి ట్రేడింగ్ లో మోస్తరు నష్టాలు..ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సెన్సెక్స్, నిఫ్టీ 5% లాభాలు…!
By admin1 Min Read