రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:196-7 (20).
చెన్నై సూపర్ కింగ్స్:146-8 (20).
“రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్ లో రెండో విజయాన్ని అందుకుంది. తాజాగా చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెపాక్ స్టేడియం లో చెన్నై పై సుదీర్ఘ కాలం తరువాత మళ్లీ బెంగళూరు విజయ బావుటా ఎగురవేసింది.”
మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటేదార్ 51 (32; 4×4, 3×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫిల్ సాల్ట్ 32 (16; 5×4, 1×6), కోహ్లీ 31 (30; 2×4, 1×6), దేవ్ దత్ పడిక్కల్ 27 (14; 2×2, 2×2), టిమ్ డేవిడ్ 22 నాటౌట్ (8; 1×4, 3×6) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు, మతీష పతిరనా 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై
రచిన్ రవీంద్ర 41 (31; 5×4), రవీంద్ర జడేజా 25 (19; 2×4, 1×6), ఆఖర్లో ధోనీ 30 నాటౌట్ (16; 3×4, 2×6) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ చెన్నై బ్యాటర్లను కట్టడి చేశారు. హేజల్ వుడ్ 3 వికెట్లు, యష్ దయాళ్ 2 వికెట్లు, లివింగ్ స్టోన్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ పడగొట్టారు. దీంతో సుదీర్ఘ కాలం తరువాత చెపాక్ స్టేడియం లో చెన్నై పై బెంగళూరు గెలుపొందింది.