ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వచ్చేవన్నీ మంచి రోజులనే సానుకూల దృక్పథంతో కొత్త ఏడాదిని స్వాగతిస్తాం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో గణనీయమైన ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశ్వావసు నామ సంవత్సరం తెలుగు ప్రజలందిరిలో సంతోషాన్ని నింపాలని, సకల విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ… ప్రతి ఒక్కరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..!
By admin1 Min Read

