‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ కథానాయకుడిగా దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుంది.అయితే ఈ సినిమా గురించి అల్లు అర్జున్ అభిమానులు ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ చిరం గురించి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడనే వార్తలు గట్టిగా ప్రచారంలో ఉన్నాయి.అట్లీ, షారుక్‌ను ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు సమాచారం.
కాగా ఈ సినిమా లాంచ్, రిలీజ్ డేట్స్ విషయంలో కూడా ఆసక్తికరమైన అప్‌డేట్స్ వచ్చాయి. నిర్మాత రవిశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల ప్రకారం,అట్లీ-అల్లు అర్జున్ మూవీ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటుందని, ఆ రెండింటి తర్వాత పుష్ప-3 మొదలవుతుందని తెలిపారు. మరోవైపు,అల్లు అర్జున్ ఈ సినిమాలో తన లుక్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.పైగా, జీ స్టూడియోస్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానుందని సమాచారం.మొత్తం మీద, ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.