టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ (MAD Square) చిత్రం, ఉగాది కానుకగా మార్చి 28న విడుదలై మంచి విజయాన్ని సాధించింది.అయితే,ఈ సినిమా టికెట్ రేట్లు అధికంగా ఉన్నాయనే విమర్శలు, అలాగే ఫేక్ కలెక్షన్లు చూపిస్తున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.పలు వెబ్‌సైట్‌లలో ఈ సినిమాకు నెగటివ్ రివ్యూలు రావడంతో నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
నిజమైన కలెక్షన్లు తెలుసుకోవాలనుకునేవారు తన దగ్గరకు రాగలరని, హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టే అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.సినిమా విజయాన్ని అడ్డుకోవడానికి కావాలని నెగిటివ్ రివ్యూలు రాస్తున్నారని ఆరోపిస్తూ,తనపై పగ ఉంటే తన సినిమాలను పూర్తిగా బహిష్కరించాలని సవాల్ విసిరారు.అదేవిధంగా,తన సినిమాల గురించి వ్యాసాలు రాయకుండా, ప్రకటనలు తీసుకోకుండా చూపించాలని మీడియాకు సూటిగా చెప్పేశారు.ఈ వివాదంపై సినిమా పరిశ్రమలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.