భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. టారిఫ్‌ల అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న తుది నిర్ణయం ప్రకటించనుండటంతో వాణిజ్య రంగంలో ఉత్కంఠ నెలకొంది.సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.ఈ అంశంపై వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ, భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై 100% సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.అమెరికా ఉత్పత్తులపై అనేక దేశాలు అధిక సుంకాలు విధించడం వల్ల, తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తెలిపారు. యూరోపియన్ యూనియన్ అమెరికా పాల ఉత్పత్తులపై 50% టారిఫ్ విధిస్తోందని, జపాన్ అమెరికా బియ్యంపై 700% సుంకం వసూలు చేస్తున్నట్లు వివరించారు. కెనడా బటర్, చీజ్‌పై 300% టారిఫ్ విధించగా, భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై 100% టారిఫ్‌లను అమలు చేస్తున్నట్లు చెప్పారు.ఈ పరిస్థితుల్లో అమెరికా కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతుందని,అధ్యక్షుడు చారిత్రాత్మక మార్పులు చేయబోతున్నారని వైట్‌హౌస్ ప్రకటించింది.ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రతీకార సుంకాలకు అమెరికా సిద్ధం – ఏప్రిల్ 2న ట్రంప్ తుది నిర్ణయం
By admin1 Min Read