సినిమా విజయం కేవలం బడ్జెట్ మీదే ఆధారపడదు, కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా, కొత్త నటీనటుల తారతమ్యం ఉండదనడానికి మరో ఉదాహరణగా ‘ఒక బృందావనం’ నిలవనుంది.ఇటీవల కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఎన్నో చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి.ఇప్పుడు అదే కోవలోకి చేరేందుకు సిద్ధమైన చిత్రం ‘ఒక బృందావనం’. ఈ చిత్రంలో బాలు, షిన్నోవా ప్రధాన పాత్రలు పోషించగా, శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డీ.డి. శ్రీనివాస్ తదితర సీనియర్ నటీనటులు నటించారు.
బొత్స సత్య దర్శకత్వం వహించగా, కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు ఈ సినిమాను నిర్మించారు.నిర్మాతలు మాట్లాడుతూ – “విభిన్నమైన కథాంశంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమాను రూపొందించాం. వినోదంతో పాటు అర్థవంతమైన సందేశాన్ని కూడా ఇందులో పొందుపరిచాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిత్ర ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్‌తో పాటు ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తాం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ‘ఒక బృందావనం’ తప్పకుండా నచ్చుతుంది” అని తెలిపారు.